భారాస రాజకీయ కుట్రలో మాజీ సర్పంచ్‌లు బలి కావద్దు !

భారాస రాజకీయ కుట్రలో మాజీ సర్పంచ్‌లు బలి కావద్దని, బకాయి బిల్లులన్నీ చెల్లిస్తామని తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. భారాస కేవలం స్వార్థ రాజకీయాల కోసమే మాజీ సర్పంచ్‌లను వాడుకుంటోందని మండిపడ్డారు. గతంలో సర్పంచ్‌ల ఆత్మహత్యలకు కేసీఆర్, హరీశ్‌రావే కారణమని ఆరోపించారు. మాజీ సర్పంచ్‌లు ముందుగా వారి ఇళ్ల వద్ద వెళ్లి ధర్నాలు చేయాలన్నారు. మాజీ సర్పంచ్‌ల అంశాన్ని రాజకీయ ఎజెండాగా మార్చుకొని ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే బిల్లులు పెండింగ్‌లో నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనుల బకాయి బిల్లులను చెల్లించినట్లు తెలిపారు. మాజీ సర్పంచ్‌లు భారాస ట్రాప్‌లో పడవద్దని సూచించారు. గతంలో సర్పంచ్‌ ఆత్మహత్యలకు కారణమైన అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావునే నిలదీయాలన్నారు. మాజీ సర్పంచ్‌ల బాధ తమకు తెలుసని.. బకాయి బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org