రతన్‌ టాటా భౌతికకాయానికి చంద్రబాబు నివాళి !


పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్‌ గ్రహీత, టాటా సన్స్‌ సంస్థ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా భౌతికకాయానికి ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నివాళులర్పించారు. ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లోని పార్థివదేహం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తోపాటు, గ్రూప్‌ ఉన్నతాధికారులు, టాటా కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్‌ టాటా లాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ లోకాన్ని వీడిపోవడం తీరని లోటన్నారు. ప్రజల సందర్శనార్థం రతన్‌ టాటా పార్థివ దేహాన్ని ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో ఉంచారు. మరికాసేపట్లో రతన్‌ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ముంబయిలోని వర్లి శ్మశానవాటికలో అంత్య క్రియలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org