Ad Code

రోజూ 30 నిమిషాలు వాకింగ్ - ప్రయోజనాలు !


రోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో శారీరక వ్యాయామం కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కచ్చితంగా ప్రతీ రోజూ వాకింగ్‌ను అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కనీసం 30 నిమిషాలైనా వాకింగ్ చేయాలని చెబుతున్నారు. క్రమంతప్పకుండా రోజూ వాకింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతీరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గి, రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది హార్ట్‌స్ట్రోక్‌ ముప్పును తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా ప్రతీరోజూ 30 నిమిషాలైనా వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేయడం వల్ల వేగంగా క్యాలరీలు బర్న్‌ అవుతాయి. రోజూ వాకింగ్ చేయడం వల్ల మెటబోలిజం వేగమవుతుంది, శరీరంలో కొవ్వు వేగంగా తగ్గింది వెరసి తర్వగా బరువు తగ్గుతారు. అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా వాకింగ్ బాగా ఉపయోగపడుతుందని నిపునులు అంటున్నారు. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా చల్లటి గాలి వీచే పార్కుల్లో వాకింగ్ చేయడం వల్ల మరింత మేలు జరుగుతుంది. వాకింగ్‌ చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ కూడా పెరుగుతుంది. తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉంచడంలో వాకింగ్ ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచేందుకు దోహదపడుతుంది. దీంతో వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వాకింగ్ దోహదపడుతుంది. ఎముకలు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు దూరం కావాలంటే రోజూ కచ్చితంగా వాకింగ్ అలవాటు చేసుకోవాలి.

Post a Comment

0 Comments

Close Menu