Ad Code

నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ అరెస్ట్ !


హైదరాబాద్ లోని రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో రూ. వేల కోట్ల విలువైన 84 ఎకరాల ల్యాండ్‌ను స్వాహా చేసేందుకు యత్నించారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించి ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్‌ చేశారు. దీంతో బిల్డర్‌ మారగొని లింగం గౌడ్‌ సాయంతో ల్యాండ్‌లో పాగా వేశారు. 2003లో నకిలీ పత్రాలపై కోర్టులో కేసు వేసింది అప్పటి ప్రభుత్వం. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేసింది ప్రభుత్వం. శివరామకృష్ణవి నకిలీ పత్రాలని సుప్రీంకోర్టు తేల్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో శివరామకృష్ణతో పాటు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 19తేదిన శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్‌, లింగం గౌడ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. శివరామకృష్ణ, మహేశ్ బాబుతో యువరాజు, వెంకటేశ్ తో ప్రేమంటే ఇదేరా, రవితేజతో దరువు, యువత, రైడ్, ఏమో గుర్రం ఎగరావొచ్చు, అందరి బంధువయా వంటి పలు సినిమాలు నిర్మించారు.

Post a Comment

0 Comments

Close Menu