పూణెలో మహిళను చంపిన చిరుత పులి !


హారాష్ట్ర, పూణెకు సమీపంలోని పింప్రి-పెంధార్ గ్రామంలో సుజాత ధేరే అనే మహిళ పొలంలో పని చేస్తుండగా మాటు వేసిన చిరుత పులి ఒక్కసారిగా మహిళపై దాడి చేసింది. దాదాపు వంద అడుగుల దూరం లాక్కెళ్లింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిరుత పులుల సంచారంపై చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారి తెలిపారు. చెరుకు పొలాలను పులులు నివాసంగా చేసుకుంటాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పింప్రి-పెంధార్, ఇతర ప్రాంతాల్లో 40 బోనులు, 50 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. చిరుతపులిని గుర్తించడానికి థర్మల్ డ్రోన్‌లను సైతం ఉపయోగిస్తున్నట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. స్థానికులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org