చెరువులో భారీ భవనాన్ని బాంబులతో కూల్చేసిన అధికారులు !


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని మధిర గ్రామం కుతుబ్‌శాయి పేట్ గ్రామంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో చర్యలు తీసుకున్నారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈక్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి 12 సంవత్సరాల క్రితం మల్కాపురం పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు. నీళ్లలో అడుగుపెట్టకుండా లోనికి వెళ్లడానికి కొంత దూరం నుంచే మెట్లు కట్టారు. యజమాని కుటుంబ సభ్యులు వారాంతాల్లో వచ్చి ఇక్కడ సేదతీరుతూ ఉండేవారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org