Ad Code

కౌన్‌ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్‌లో రూ.కోటి గెలిచిన చందర్‌ ప్రకాశ్‌ !


కౌన్‌ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్‌ నడుస్తోంది. ఈ షోలో జమ్మూకశ్మీర్‌కు చెందిన చందర్‌ ప్రకాశ్‌ అనే యువకుడు కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌ ఇతడే కావడం విశేషం. రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినప్పటికీ రిస్క్‌ తీసుకోకుండా గేమ్‌ నుంచి క్విట్‌ అయ్యాడు. బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన కంటెస్టెంట్‌ చందర్‌ ప్రకాశ్‌ రూ.కోటి ప్రశ్నకు చేరుకున్నాడు. ''ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ.. 'శాంతి నివాసం' అనే అరబిక్‌ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉంది'' అని వ్యాఖ్యాత అమితాబ్‌ ప్రశ్న అడిగారు. దీనికి ఎ. సోమాలియా, బి. ఒమన్‌, సి. టాంజానియా, డి. బ్రూనై నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో చందర్‌ ప్రకాశ్‌ 'డబుల్ డిప్‌' లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకుని ఆప్షన్‌ సి. టాంజానియాను ఎంచుకున్నాడు. అది సరైన సమాధానం కావడంతో రూ.కోటి గెలుచుకున్నట్లు బిగ్‌బీ ప్రకటించాడు. వెంటనే షోలో ఉన్నవారంతా చప్పట్లతో అతడిని అభినందించారు. అమితాబ్‌ సీట్లో నుంచి లేచి అతడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. రూ.కోటితో పాటు అతడు ఓ కారును కూడా బహుమతిగా అందుకున్నాడు. ఆ తర్వాత చందర్‌ ప్రకాశ్ రూ.7కోట్ల ప్రశ్నకు చేరుకున్నాడు. ''1587లో ఉత్తర అమెరికాలో ఇంగ్లీష్‌ దంపతులను జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?'' అని అమితాబ్‌ ప్రశ్నించాడు. దీనికి ప్రకాశ్‌కు జవాబు తెలియకపోవడంతో పాటు అప్పటికే లైఫ్‌లైన్లు అన్ని వినియోగించుకోవడంతో తప్పనిపరిస్థితుల్లో షో నుంచి క్విట్‌ అయ్యాడు. ఆ తర్వాత అమితాబ్‌ సరదాగా ఆ ప్రశ్నకు సమాధానం ఊహించమని అడిగారు. అతడు ఆప్షన్‌ ఎ. వర్జనీయా డేర్‌ అని చెప్పగా.. అదే సరైన జవాబు అని బిగ్‌బీ తెలిపారు.


Post a Comment

0 Comments

Close Menu