వినేశ్‌పై అనర్హత విచారకరం : రాహుల్ గాంధీ
ప్రపంచ చాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరిన వినేశ్ భారత్‌కు గర్వకారణం. సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం విచారకరం. భారత ఒలింపిక్ సంఘం ఈ నిర్ణయాన్ని గట్టిగా సవాలు చేస్తుందని ఆమెకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం'అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో అన్నారు. పట్టు వదలకుండా ఆమె మళ్లీ రంగంలోకి దిగుతుందనే నమ్మకం ఉంది. వినేశ్ దేశం గర్వించేలా చేశావు. దేశం మొత్తం మీకు మద్దతుగా నిలుస్తోంది తెలిపారు. వినేశ్ ఫోగట్ చాలా అర్హత నిబద్ధత గల క్రీడాకారిణి. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళ. ఆమె ఒక ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించారు. ఫైనల్స్‌లో మరొక ప్రపంచ ఛాంపియన్‌తో బరిలోకి దిగాల్సింది. ఆమె అనర్హత భారతీయులందరికీ, వినేష్ ఫోగట్ మద్దతుదారులందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'అని అన్నారు. పంజాబ్ సీఎంభగవంత్ మాన్ సింగ్ స్పందించారు. ఆమె బరవును చెక్ చేయాల్సిన పని కోచ్, ఫిజియోథెరపిస్టులది. ఇప్పుడు అనర్హత పడింది. ఈ అన్యాయాన్ని ఆపాలి. ఇంత పెద్ద స్థాయిలో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులకు లక్షల్లో జీతం ఇస్తున్నారు. వారేమైనా సెలవుల కోసం అక్కడికి వెళ్లారా?' అని మండిపడ్డారు. అనర్హత వేటు నేపథ్యంలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. భారత దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొంటున్నారు.