కర్ణాటక ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ !


ర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం బెంగళూరు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. ఈ పర్యటన లో కర్ణాటక అటవీ శాఖ మంత్రితో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు ఉంటాయి. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా పవన్ ప్రణాళికలు చేస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org