స్మార్ట్‌ఫోన్‌ కింద ఉండే రంధ్రం ఉపయోగం ?


స్మార్ట్‌ఫోన్‌కి కింద ఉండే చిన్న రంధ్రాన్ని సాధారణంగా మైక్రో ఫోన్‌ అనుకుంటాం. అయితే ఇది మైక్రోఫోన్‌ గ్రిల్‌. ఈ రంధ్రం నాయిస్‌ క్యాన్సిలేషన్‌ మైక్రోఫోన్‌గా పనిచేస్తుంది. మనం కాల్స్ మాట్లాడే సమయంలో చుట్టు పక్కల నుంచి వచ్చే శబ్దాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ మైక్రో ఫోన్ మెయిన్‌ మైక్రోఫోన్‌తో కలిసి పనిచేస్తుంది. మనం ఎవరికైనా కాల్‌ చేసినప్పుడు ఈ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ మైక్రోఫోన్‌ చుట్టుపక్కల నుంచి వచ్చే శబ్ధాలను గ్రహిస్తుంది. దీంతో మనం మాట్లాడేందుకు ఉపయోగించే ప్రధాన మైక్రోఫోన్‌ ద్వారా కేవలం మనం మాట్లాడే మాటలే అవతలి వ్యక్తులకు వినబడేలా చేస్తాయి. దీంతో మీరు మాట్లాడే మాటలు అవతలి వ్యక్తులకు స్పష్టంగా వినిపిస్తాయి. అయితే పక్కనున్న శబ్దాలు వినిపించినప్పటికీ దాని తీవ్రత మాత్రం ఎంతో కొంత తగ్గుతుంది. ఈ నాయిస్ క్యాన్సిలేజన్‌ లేకపోతే కాల్స్‌ మాట్లాడడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. చుట్టు పక్కల శబ్ధాలు వినిపించడంతో కాల్‌ క్లారిటీగా వినిపించదు. కొన్ని రకాల పాత ఫోన్‌లలో ఇలాంటి ఫీచర్‌ అందుబాటులో ఉండవు. అయితే ప్రస్తుతం వస్తున్న దాదాపు అన్ని ఫోన్స్‌లో ఈ ఫీచర్‌ను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఇక ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఇయర్‌ బడ్స్‌లోనూ ఇలాంటి ఫీచర్లను కంపెనీలు పరిచయం చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఇయర్ బడ్స్‌తో కూడా నాయిస్‌ లేకుండా సంభాషణలు చేసుకోవచ్చు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org