పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాజీ మంత్రుల ములాఖత్ !
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పలువురు కుటుంబ సభ్యులు సోమవారం పరామర్శించారు. అనంతరం కారాగారం వెలుపల వారు మాట్లాడుతూ తెదేపా నాయకులు విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని, వైకాపా కార్యకర్తలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.