ఆగస్టు 3న రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన !
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బృందంతో ఆగస్టు 3న రాత్రి అమెరికా బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ బృందం కలవనుంది. వారితో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానున్నారు. డల్లాస్ తోపాటు ఇతర రాష్ట్రాల్లో రేవంత్ బృందం పర్యటన కొనసాగనుంది. ఆగస్టు 11న రేవంత్ రెడ్డి అమెరికా నుంచి తిరిగి రానున్నారు. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది.