గురువు ఆశీస్సులతో ప్రపంచాన్ని గెలవచ్చు !
టీ20 ప్రపంచ కప్‌ను భారత్ సొంతం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా జట్టు కృషిని కొనియాడారు. ''క్రికెట్, జీవితానిది ఒకటే స్టోరీ. గురువు ఆశీస్సులతోనే ప్రపంచాన్ని గెలవచ్చు. గురు పూర్ణిమ రావడానికి ముందే జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు టీమిండియా మరువలేని గురుదక్షిణను ఇచ్చింది'' అని 'ఎక్స్' (ట్విటర్) వేదికగా ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. టీమ్ఇండియా గెలవడంతో భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి కూడా సంబరాలు చేసుకున్నారు. ''భారత్ జట్టు కృషి ఫలించింది. ఈ విజయంతో ఎట్టకేలకు 17 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. మీ అందరికి నా అభినందనలు'' అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.