దేశీయ మార్కెట్లో ఇన్ఫినిక్స్ జీరోబుక్ అల్ట్రా ల్యాప్‌టాప్ ను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. ఇది విండోస్ 11 హోమ్ OS పైన పనిచేస్తుంది. మరియు 15.6 అంగుళాల పుల్ HD+ IPS డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ ల్యాప్‌టాప్ ను ఫ్లిప్‌కార్ట్ ను కొనుగోలు చేయవచ్చు. మూడు వేరియంట్‌లలో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. 1080x 920 పిక్సల్ రిజల్యూషన్‌తో 15.6 అంగుళాల పుల్ HD IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. 178 డిగ్రీల కోణంలో డిస్‌ప్లేను చూసేందుకు వీలుంటుంది. 400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది. Intel core అల్ట్రా 9 ప్రాసెసర్ సహా Intel Arc గ్రాఫిక్స్ తో జతచేయబడింది. 32GB LPDDR5x ర్యామ్‌ను కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌ల కోసం ఈ ప్రాసెసర్ Intel AI న్యూట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉంది. వీడియో కాల్స్ కోసం పుల్ HD వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా Mi-Pi ప్రోటోకాల్ సాయంతో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) బ్యూటీక్యామ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. DTS ఆడియోతో కూడిన డ్యూయల్ 2W మైక్రోఫోన్‌లతో అందుబాటులోకి వచ్చింది. 100W అడాప్టర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 70Wh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ సింగిల్ ఛార్జింగ్‌తో 1080p వీడియో ప్లేబ్యాక్‌తో 13 గంటలపాటు వినియోగించుకోవచ్చు. లేదా వెబ్ బ్రౌజింగ్ కోసం 10 గంటలపాటు వినియోగించుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చింది. ICE స్ట్రోమ్ 2.0 కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. మరియు రెండు USB 3.0 పోర్టులు, రెండు USB-C, SD కార్డు స్లాట్, HDMI 1.4 పోర్ట్, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5.3 మరియు వైఫై 6E ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
0 Comments