వైసీపీ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది !
తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతల ఫోన్‌లు ట్యాప్ చేశారని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలను ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పలువురు నేతలను బెదిరించిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వాన్ని మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.