ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ్‌ మాఝీ ప్రమాణస్వీకారం !


డిశాలోని భువనేశ్వర్‌, జనతా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో  నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత మోహన్‌ చరణ్‌ మాఝీ నేటి సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిషాలో బీజేపీ 78 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. బిజు జనతాదళ్ 51 సీట్లతో సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org