పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు !

పోలవరాన్ని జగన్‌ గోదావరిలో ముంచారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఐదేళ్ల అసమర్థ పాలనతో పోలవరం ప్రాజెక్టు మరుగునపడిపోయిందన్నారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్‌ చేసిన నష్టమే ఎక్కువన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరాన్ని వైసీపీ పాలనలో ఎలా విధ్వంసం చేయబడిందో వివరించారు. సమస్యలను, సవాళ్లను అధిగమించి ఐదేళ్లలో 72 శాతం పనులు పూర్తి చేశామని కానీ గత ఐదేళ్లలో నాలుగు శాతం పనులు కూడా పూర్తి కాలేదని తెలిపారు. తప్పుడు నిర్ణయాలు - రివర్స్ టెండర్ల డ్రామాలు ఆడారని చంద్రబాబు మండిపడ్డారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org