Ad Code

తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల


తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సెస్సీ బోర్టు విడుదల చేసింది. ఈ ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఇక పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత కాగా.. ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక గతేడాది వార్షిక పరీక్షలో 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది

Post a Comment

0 Comments

Close Menu