జులై 1 నుంచి 3 వరకు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటన !
జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో బిజీ గా ఉండనున్నారు. 1న గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశం. 2న కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశంకానున్నారు. 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.