Ad Code

పౌర సరఫరాల శాఖలో లోపాలు ఉన్నాయి - తొందరలోనే సరిదిద్దుతాం !


ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న క్షేత్ర స్థాయి పరిశీలనలో గోడౌన్ లలో ఉన్న రేషన్ బియ్యంపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో ఎన్ని తనిఖీలు చేశారని అధికారులను మంత్రి ప్రశ్నించారు. రేషన్ బియ్యం మాఫియా, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న గోల్ మాల్ ఏంటని ఆరా తీశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్ గా రేషన్ బియ్యంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సమగ్ర రిపోర్టు తయారు చేసుకుని రేషన్ బియ్యం దందా పై సిఐడి ను ఇన్వాల్వ్ చేస్తామన్నారు. ప్రభుత్వం తరుపున చర్యలు తీసుకుంటాం.. కాకినాడ పోర్ట్ లో దందా జరుగుతుంది.. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు.. సొంత వ్యవస్థలు నడుపుతున్నారు అని మండిపడ్డారు. క్రిమినల్ చర్యలు తీసుకుంటాము.. ఒక కుటుంబం కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు.. కాకినాడలో సామాన్యుడు పొట్ట కొట్టే వ్యవస్థీకృత మాఫియా ఉంది అని ఆయన ఆరోపించారు. 5 కోట్ల జనాభాలో నాలుగు కోట్ల 45 లక్షల మందికి ప్రభుత్వం రేషన్ ఇస్తుందన్నారు. పౌర సరఫరా శాఖలో లోపాలు ఉన్నాయి. తొందరలోనే సరిదిద్దుతాం.. ఒక్క రోజులో 7, 615 మెట్రిక్ టన్నులు బియ్యం సీజ్ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu