తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల !


తెలంగాణలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలను నిర్వహించనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమైన ప్రవేశాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఎస్ఎస్‌సీ, ఇంటర్ మార్కుల మెమోలు, టీసీ, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారం కోసం టీజీఈఏపీ వెబ్‌సైట్‌ని సందర్శించాలని పేర్కొంది. కాగా, జూన్‌ 27 తేదీ నుంచి ప్రవేశాలను మొదలు పెట్టాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా జూన్‌ 30 తేదీ నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు ఆవకాశం ఇవ్వనున్నారు. ఇక చివరగా మొదటి విడత సీట్ల కేటాయింపు జూలై 12వ తేదీన జరగనుంది. ఆ తదుపరి జూలై 19వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ మొదలు కానుంది. రెండో విడతలో జూలై 24 తేదీ సీట్ల కేటాయింపు జరుగనుంది. ఇక చివరి మూడో విడత కౌన్సిలింగ్‌ను జూలై 30 తేదీ మొదలు పెట్టి.. ఆగస్టు 5 తేదీ వరకు సీట్లు కేటాయించబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆగస్టు 12వ తేదీ నుంచి ఏదైనా ఇంటర్నల్‌ స్లైడింగ్‌ సీట్ల కేటాయింపులను ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టనున్నారు. ఇక చివరగా ఆగస్టు 17 తేదీన స్పాట్‌ ఆడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనుంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org