తిరుమలకు చేరిన సీఎం రేవంత్ రెడ్డి !


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శ్రీవేంకటేశ్వరుడి సన్నిథిలో మనవడి మొక్కు తీర్చుకునేందుకు కొద్ది సేపటి క్రితమే తిరుమలకు చేరుకున్నారు. రచన అతిథి గృహం వద్ద తిరుమల ఆలయ ఈవో ధర్మారెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. రేపు వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకోనున్నారు. మనమడి తలనీలాలు సమర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి   వచ్చారు. తొలుత హైదరాబాద్ బేగంపేట ఎయిర్ ఫోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్ ఫోర్టుకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రేపు తన మనమడి పుట్టెంటికలను స్వామి వారికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పించనున్నారు. ఇవాళ రాత్రి తిరుమలలోనే ఆయన బస చేసి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org