నాగోలులో యువతి హల్‌చల్‌ !


హైదరాబాద్‌ లోని నాగోలులో శుక్రవారం ఉదయం ఓ యువతి మద్యం మత్తులో హల్‌ చల్‌ చేసింది. స్థానిక ఫతుల్లాగూడ ప్రాంతంలో ఓ యువతి, యువకుడు కారులో వచ్చి నడిరోడ్డుపై బహిరంగంగా మద్యం సేవిస్తూ కనిపించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వారు హెచ్చరించారు. దీంతో వారిద్దరూ వాకర్స్‌పై ఎదురుతిరిగారు. కారును వేగంగా నడుపుతూ భయాందోళనకు గురి చేశారు. పోలీసులకు ఫోన్‌ చేసేందుకు కొందరు ప్రయత్నించగా, అడ్డుకుని దుర్భాషలాడారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే యువతి, యువకుడు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ తతంగాన్ని కొందరు ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org