8 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీతో ఓలా S1 X స్కూటర్ !


దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కొత్త S1 X స్కూటర్ల డెలివరీలను ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఓలా S1 X ఎలక్ట్రిక్ స్కూటర్లు 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ కాన్ఫిగరేషన్లలో లభిస్తాయి. ఈ బ్యాటరీలతో అన్ని రకాల వినియోగదారుల రేంజ్ అవసరాలను తీర్చనున్నాయి. S1 X స్కూటర్ల ధర కేవలం రూ.69,999 (ఎక్స్-షోరూమ్) నుంచే ప్రారంభమవుతుంది. ఈ అఫర్డబుల్ ప్రైస్‌తో కంపెనీ మాస్-మార్కెట్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. S1 X ఎంట్రీ లెవెల్ స్కూటర్‌ ధర చాలా మందికి అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది. వీటిపై ఓలా ఎలాంటి ఎక్స్‌ట్రా కాస్ట్ లేకుండా 8 ఏళ్లు లేదా 80,000 కి.మీ పాటు ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీని ఆఫర్ చేస్తోంది. దీంతో కస్టమర్లు బ్యాటరీ, స్కూటర్ మన్నిక గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే కస్టమర్లు వారంటీని పెంచుకోవచ్చు. ప్రయాణించే కిలోమీటర్ల లిమిట్‌ను రూ.4,999కి 1,00,000 కిమీకి, రూ.12,999కి 1,25,000 కిమీ వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. రూ.29,999కి 3KW పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్ యాక్సెసరీని కూడా పొందవచ్చు. కొత్త స్కూటర్ల డెలివరీ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడారు. "S1 X స్కూటర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్‌కి అడ్డంకిగా ఉన్న ఖర్చుల భారాన్ని తొలిగించాం. మాస్-మార్కెట్ పోర్ట్‌ఫోలియోలోకి ప్రవేశించడం ద్వారా మా టార్గెట్ కస్టమర్ బేస్‌ను విస్తరించగలం. ఈ స్కూటర్లను ఎక్కువ మంది ప్రజలు కొనుగోలు చేయడం వల్ల భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతుంది. S1 X స్కూటర్లను కొనుగోలు చేయడం, ఉపయోగించడం చాలా సులభం. అందుకే S1 X స్కూటర్లు భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ మంచి ఆప్షన్ అవుతుంది." అని వివరించారు. S1 X రేంజ్‌ స్కూటర్స్‌లో ఫిజికల్ కీ ఆప్షన్ అందించారు. S1 X 4 kWh బ్యాటరీ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌పై 190 కిమీ ప్రయాణం చేయవచ్చు. 3 kWh వేరియంట్ 143 కిమీ, 2 kWh వేరియంట్ 95 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 6kW మోటార్‌తో వస్తుంది. ఈ మోటార్‌తో 4kWh, 3kWh వేరియంట్ల స్కూటర్లు కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కి.మీ చేరుకోగలవు. 90 కిమీ/గం గరిష్ఠ వేగంతో దూసుకెళ్లగలవు, 2 kWh వేరియంట్‌ 4.1 సెకన్లలో సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుంది. ఇది 85 కిమీ/గం గరిష్ట వేగంతో వెళ్లగలదు. స్కూటర్‌లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ వంటి మూడు మోడ్స్‌ ఉన్నాయి. రైడర్లు డ్రైవింగ్ అవసరాలకు తగ్గట్లు ఈ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org