దేశీయ మార్కెట్లో టెక్నో కమోన్ 30 సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా మొత్తం నాలుగు ఫోన్లను లాంచ్ చేయనున్నారు. నెట్టింట వైరల్ అవుతోన్న వివరాల ప్రకారం ఈ ఫోన్లో మీడియాటెక్ హెలియో జీ99 చిప్ సెట్, టెక్నో కమోన్ 30 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్‌ను ఇవ్వనున్నారు. అలాగే టెక్నో కమోన్ 30 ప్రో 5జీ, హై ఎండ్ టెక్నో కమోన్ 30 ప్రీమియర్ 5జీ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్ సెట్లతో రానున్నాయి. ఈ ఫోన్లో 70 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలను అందించనున్నారు. ఈ ఫోన్లలో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ చేసే కెమెరా ఈ ఫోన్ సొంతం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం కూడా ఇందులో 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లలో 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్ప్లేను అందించనున్నారు. 1080 x 2436 పిక్సెల్స్ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
0 Comments