1.66 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్ లను తొలగించిన కేంద్ర ప్రభుత్వం ?
కేంద్ర ప్రభుత్వం 1 కోటికి పైగా సిమ్ కార్డ్ లని బ్లాక్ చేసింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు టెలికాం మినిస్ట్రీ దాదాపు 1.66 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్ లను తొలగించినట్లు తెలిపింది. దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్ లకు చెక్ పెట్టేందుకు సరైన వెరిఫికేషన్ లేదా స్కామ్ లకు సంబంధం కలిగినట్లుగా భావిస్తున్న మొబైల్ కనెక్షన్ లను తొలగించినట్లు చెబుతున్నారు. ఇది ఇప్పటి వరకూ తొలగించిన మొబైల్ కనెక్షన్ ల వివరాలు కాగా, త్వరలోనే 18 లక్షల సిమ్ కార్డ్ లను ప్రభుత్వం తొలగించ బోతోందనే వార్త కూడా బయటకి వచ్చింది. మొబైల్ కాల్స్, SMS మరియు వాట్సాప్ ల ద్వారా స్కామర్లు బాధితులకు ఉచ్చు బిగిస్తున్నారు. అందుకే, ఈ సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి, స్కామ్ లకు సంబంధం వున్న మొబైల్ కనెక్షన్ ల పైన టెలికాం మినిస్ట్రీ కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజలు వారి మొబైల్ కనెక్షన్ లను చెక్ చేసుకోవడానికి ముందుగా TAFCOP సర్వీస్ ను తీసుకు వచ్చిన ప్రభుత్వం, దానికి మరింత సహకారంగా సంచార్ సాథీని కూడా తీసుకు వచ్చింది. TAFCOP ద్వారా యూజర్ పేరు మీద ఉన్న అన్ని మొబైల్ నెంబర్ లను తెలుసుకోవచ్చు. వారు ఉపయోగించని నెంబర్ ని బ్లాక్ చేసే అవకాశం వుంది.