అలెక్సాను ఉపయోగించి కోతులను తరిమిన నిఖితకు ఆనంద్ మహీంద్రా జాబ్ ఆఫర్ !


త్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో 13 ఏళ్ల  నిఖిత అమెజాన్ అలెక్సాను ఉపయోగించి ఇంట్లోకి చొరబడ్డ కోతులను భయపెట్టి తరిమేసింది. కోతులు వచ్చినప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో అలోచించి దైర్యంగా ఎదుర్కొన్న ఆ అమ్మాయిని పలువురు ప్రశంసిస్తున్నారు. దీనికి ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక ట్వీట్ చేశారు. టెక్నాలజీకి మనం బానిసలుగా మారుతామా? లేదా ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మాస్టర్స్ అవుతామా? అనేది ప్రశ్న. 13 ఏళ్ల అమ్మాయి వేగంగా ఆలోచించి అమెజాన్ అలెక్సాను ఉపయోగించి కోతుల భారీ నుంచి బయటపడింది. ఆమె ప్రదర్శించిన స్ఫూర్తి చాలా గొప్ప విషయం. నిఖిత చదువు పూర్తయిన తరువాత ఎప్పుడైనా కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే ఆమెను మాతో చేరటానికి ఒప్పించగలమని ఆశిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org