Ad Code

సూర్యగ్రహణాన్ని స్మార్ట్‌ఫోన్ తో తీయవద్దని నాసా హెచ్చరిక!


కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు మొదలైన వాటితో గ్రహణాలను తీయడానికి ఇష్టపడే వారికి నాసా శాస్త్రవేత్తలు ప్రత్యేక సందేశాన్ని ఇచ్ఛారు. సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. భారత్ సహా ఆసియాలో మాత్రం కనిపించదు. సూర్యగ్రహణం సమయంలో స్మార్ట్‌ఫోన్ కెమెరాను సూర్యునికి నేరుగా ఉంచి ఫొటోలు తీయొద్దని నాసా హెచ్చరించింది. గ్రహణాన్ని వీక్షించే ముందు స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఉపయోగించడం గురించి అడిగిన ప్రశ్నకు నాసా ట్విట్టర్ (X) వేదికగా కొన్ని జాగ్రత్తలు సూచించింది. '@NASAHQPhoto టీమ్‌ చెప్పిన సమాధానం ప్రకారం.. ఫోన్ సెన్సార్ ఏదైనా ఇతర ఇమేజ్ సెన్సార్ లాగా దెబ్బతింటుంది. నేరుగా సూర్యుని వైపు చూడొద్దు. మీరు ఫోన్‌లో ఏదైనా మాగ్నిఫైయింగ్ లెన్స్ అటాచ్‌మెంట్‌ని ఉపయోగిస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర కెమెరాల మాదిరిగానే సరైన ఫిల్టర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. సూర్యుడిని మొత్తం కాకుండా వేరే ఏ సమయంలోనైనా ఫొటో తీస్తున్నప్పుడు మీ ఫోన్ లెన్స్‌ల ముందు ఒక పెయిర్ ఎక్లిప్స్ గ్లాసెస్ ఉంచుకోవడం సరైన పద్ధతిగా నాసా సూచించింది.  సూర్యగ్రహణాన్ని వీక్షించేటప్పుడు భద్రతపరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.సూర్యుడు పాక్షికంగా కనిపించే సమయంలో మీ కళ్లు, కెమెరాను రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రత్యేక సోలార్ ఫిల్టర్‌లను ఉపయోగించండి. సూర్యుని బయటి వాతావరణాన్ని చూడటానికి ఫిల్టర్‌ను పూర్తిగా తొలగించండి. గ్రహణ ఫొటోలను తీయడానికి మీకు ఖరీదైన కెమెరా అవసరం లేదు. ఫొటోగ్రాఫర్ నైపుణ్యం చాలా ముఖ్యం. అస్థిరమైన ఫొటోలను నివారించడానికి ట్రైప్యాడ్ ఉపయోగించండి. డిలే షట్టర్ రిలీజ్ టైమర్‌ను ఉపయోగించండి. టెలిఫోటో జూమ్ లెన్స్ లేకపోతే మారే వాతావరణాన్ని క్యాప్చర్ చేయొచ్చు. గ్రహణం సమయంలో సూర్యుని వైపు మాత్రమే కాకుండా చుట్టూ చూడండి. ప్రకృతి దృశ్యం వింతగా కనిపిస్తుంటుంది. చెట్ల ద్వారా నీడలు, కాంతితో కూడిన ప్రత్యేకమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. గ్రహణం రోజు ముందు మీ కెమెరాను ఉపయోగించడం ప్రాక్టీస్ చేయండి. లైటింగ్ పరిస్థితుల్లో ఎక్స్‌పోజర్ సెట్టింగ్‌లను ఎడ్జెస్ట్ చేయండి. గ్రహణాన్ని క్యాప్చర్ చేయడానికి బెస్ట్ సెట్టింగ్‌లను వివిధ షట్టర్ స్పీడ్, ఎపర్చర్‌లను టెస్టింగ్ చేయండి. భద్రత కోసం ఎల్లప్పుడూ సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్ ధరించండి.

Post a Comment

0 Comments

Close Menu