దేశంలోనే అత్యంత వేగవంతమైన రూటర్ ఆవిష్కరణ !


లక్ట్రానిక్స్ టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ దేశంలోనే వేగవంతమైన రూటర్ ను ప్రారంభించారు. ఈ రూటర్ సామర్థ్యం 2.4 టీబీపీఎస్ గా  ఉంది. ఈ రూటర్ టెలికాం డిపార్ట్మెంట్, సీడీవోటీ, భారత ప్రభుత్వ నివేతి సిస్టమ్ సహాయంతో పూర్తిగా మన దేశంలోనే తయారు అయింది. అశ్విని వైష్ణవ్ ఈ భారతీయ నిర్మిత రూటర్ని ప్రధాని నరేంద్ర మోదీడీ డిజిటల్ ఇండియా విజన్ లో  ప్రధాన ప్రోత్సాహకం అని తెలిపారు. డిజిటల్ ఇండియా ప్రయత్నాలకు నెట్వర్కింగ్ కీలకమని అందరికీ తెలుసని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. పూర్తిగా భారతదేశంలో తయారైన ఈ రూటర్ నెట్వర్కింగ్ ప్రక్రియలో చాలా ముఖ్యమైనదని తెలిపారు. నెట్వర్కింగ్ కోసం ఇలాంటి కోర్ రూటర్ల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ రకమైన రూటర్ దేశంలో తయారు అయినందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలోనే వేగవంతమైన రూటర్ స్పీడ్ 2.4 టీబీపీఎస్ గా ఉంది. ఒక టెరాబైట్ అంటే 1000 గిగాబైట్లు, ఒక ట్రిలియన్ బైట్లకు సమానం. ఈ రూటర్ ను  ఇన్స్టాల్ చేయడం ద్వారా, రైల్వే కమ్యూనికేషన్ నెట్వర్క్, టెలివిజన్ రంగంలో అనేక విభాగాలను అభివృద్ధి చేయవచ్చు. ఎంపీఎల్ఎస్ అనేది ఒక రూటింగ్ టెక్నిక్. దీన్ని టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లలో ఒక నోడ్ నుంచి మరొక నోడ్ కి  డైరెక్ట్ డేటా ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగిస్తారు. ఈ విధానంతో నెట్వర్కింగ్ టెక్నాలజీ బూస్ట్ అయింది. అంతేకాకుండా డిజిటల్ ఇండియాలో మౌలిక సదుపాయాలు కూడా పెరిగాయి.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org