43 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన యూట్యూబ్ మ్యూజిక్ !


గత ఏడాదిగా మెరుగైన వేతనాలు కోరుతున్న 43 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులపై యూట్యూబ్ మ్యూజిక్ టీమ్ వేటు వేసింది. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల బృందం గూగుల్‌, కాగ్నిజెంట్‌ల కోసం పనిచేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగులు గత ఏడాది కాలంగా మెరుగైన వేతనాలు, ప్రయోజనాలను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీ వీరందని తీసేస్తున్నట్లు ప్రకటించింది. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయలేదని, అనూహ్యంగా లేఆఫ్స్‌కు తెగబడ్డారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కాంట్రాక్ట్ వర్కర్ల తొలగింపుతో తమకు సంబంధం లేదని, వీరిని కాగ్నిజెంట్ నియమించుకుందని గూగుల్ పేర్కొంది. ఇక వీరి కాంట్రాక్ట్ గడువు ముగిసిందని కాగ్నిజెంట్ వివరణ ఇచ్చింది. కంపెనీలో ఇతర విభాగాల్లో వీరిని సర్దుబాటు చేసేందుకు ఏడు వారాల పాటు వేతనం చెల్లిస్తామని పేర్కొంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org