దేశీయ మార్కెట్లో మార్చి 7న వివో కొత్త V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో రెండు హ్యాండ్‌సెట్ V30 మరియు V30 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్లకు సంబంధించిన కొన్ని వివరాలున్నాయి. దీంతోపాటు ఇప్పటికే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం V30 స్మార్ట్‌ఫోన్లు అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, పికాక్ గ్రీన్ రంగుల్లో లభిస్తుందని సమాచారం. దీంతోపాటు ఈ ఫోన్ 8GB ర్యామ్ +128GB స్టోరేజీ మరియు 12GB ర్యామ్ +256GB స్టోరేజీలో ఉంటుంది. ప్రారంభ ధర రూ.33,999 గా ఉంటుంది. వివో V30 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ మరియు 12GB ర్యామ్ + 512GB వేరియంట్లలో లభిస్తుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ అంచనా వేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.41,999 కు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ధరలు, వేరియంట్లపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వివో V30 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. వెనుకవైపు 50MP కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP VCS OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ప్రైమరీ కెమెరా, 50MP వైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యండ్‌సెట్ 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. వివో V30 ప్రో హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2800*1260 పిక్సల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు సహా 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మరియు 2800 నిట్స్ గరిష్ఠ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ప్రో మోడల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 సహా మీడియాటెక్ డైమెన్సిటీ 8200 4nm ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు Mail G610 MC6 GPU తో జతచేయబడుతుంది. 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 3.1 స్టోరేజీ తో వస్తుంది. వెనుకవైపు 50MP ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX920 కెమెరాను కలిగి ఉంటుంది. OIS, LED ప్లాష్‌తో వస్తుందని సమాచారం. మరియు 50MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 50MP టెలీఫోటో పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు హై క్వాలిటీ ఆటోఫోకస్ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు V30 ప్రో మోడల్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, USB-C ఛార్జింగ్ పోర్టు, అధిక నాణ్యత కలిగిన ఆడియో సహా IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
0 Comments