రూ.16లకే బిఎస్ఎన్ఎల్ మంత్లీ వాలిడిటీ ప్లాన్‌!


పాత సిమ్ యాక్టీవ్ లో ఉంచడం కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవలసిన అవసరం లేదు. అలాగే ఎవరికైనా ఫోన్ కాల్స్ చేయాలనీ అనుకుంటే  రీఛార్జ్ చేస్తూ ఉండేవారు. ఇది ఎక్కువ సమయం ఫోన్ కాల్స్ చేసే వారికి ఇబ్బంది ఉండడంతో తరువాత అపరిమిత వాయిస్ కాల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి రాకతో అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత SMS మరియు అధిక డేటా ప్రయోజనాలు అధికమయ్యాయి. రెండు లేదా అంతకన్నా ఎక్కువ సిమ్ లను వాడుతూ కొన్ని సిమ్ లను కేవలం వాయిస్ కాల్స్ కోసం వినియోగించే వారు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి రీఛార్జ్ చేయడానికి ఇష్టపడరు. ఇటువంటి వారి కోసం టెల్కోలు అన్ని కూడా ఇప్పుడు అత్యంత సరసమైన ధరలోనే 30-రోజుల వాలిడిటీతో కొత్తగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే బిఎస్ఎన్ఎల్ మాత్రం మిగిలిన వారికి బిన్నంగా కేవలం రూ.16 లకే ఒక ప్లాన్ ను అందిస్తున్నది. ఇది మొత్తం 30 క్యాలెండర్ రోజుల చెల్లుబాటుతో అందించబడుతుంది. ఈ ప్లాన్‌లో SMS మరియు డేటా ప్రయోజనాలను అందించదు. బిఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఈ ప్లాన్‌ "20 పైసలు/నిమి ఆన్-నెట్ కాల్‌లు + 20 పైసలు/నిమిషానికి ఆఫ్-నెట్ కాల్స్" ఛార్జ్ చేయబడుతుందని పేర్కొంది. మీరు మీ BSNL SIMని యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటే కనుక ఈ వాయిస్ వోచర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org