Ad Code

ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారుగా ఎలన్‌ మస్క్‌!



సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్ అతి పెద్ద వాటాదారుగా అవతరించారు. ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాలను కలిగి ఉన్నట్లు యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌లో దాఖలు చేసిన ఫైలింగ్‌లో మస్క్ ఈ సంగతి చెప్పారు. ఆయనకు ట్విట్టర్‌లో 7,34,86,938 షేర్లు ఉన్నాయి. ట్విట్టర్‌లో వాటాలను మస్క్ కొనుగోలు చేసిన వార్త బయటకు రాగానే సోమవారం ట్రేడింగ్‌లో ఆ సంస్థ స్క్రిప్ట్ 26 శాతానికి పైగా దూసుకెళ్లి 49 డాలర్ల వద్ద నిలిచింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ట్విట్టర్ షేర్ 39.31 డాలర్లుగా ఉంది. ట్విట్టర్‌లో మస్క్ వాటా 2.89 బిలియన్ డాలర్లు. దీంతో ఈ మైక్రో బ్లాగింగ్ సంస్థలోని అతి పెద్ద వాటాదారుల్లో ఒకరిగా మస్క్ నిలిచారు. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ కంటే మస్క్‌కు నాలుగు రెట్లు అధికంగా వాటాలు ఉన్నాయి. జాక్ డోర్సీ కేవలం 2.25 శాతం వాటాలు మాత్రమే కలిగి ఉన్నారు. ట్విట్టర్ పాలసీలపై మస్క్‌ నిత్యం విమర్శలు గుప్పించేవారు. కానీ సుదీర్ఘ కాలం ట్విట్టర్ మనుగడ సాగించడానికి ఆ సంస్థ పాలసీలే కీలకంగా మారాయి.

Post a Comment

0 Comments

Close Menu