పరాగ్ అగర్వాల్ వేతనం ఎంతంటే..!


మైక్రోబ్లాగింగ్ సోషల్  మీడియా వేదిక ట్విట్టర్ నూతన సీఈవో పరాగ్ అగర్వాల్ వేతనం 10 లక్షల డాలర్లు. మన కరెన్సీలో రూ.7,51,13,500. వీటితోపాటు 12.5 మిలియన్ డాలర్ల విలువ గల స్టాక్స్ కేటాయిస్తారు. 2022 ఫిబ్రవరి నుంచి వీటిని 16 త్రైమాసికాల్లో ఆయనకు కేటాయిస్తారు. వచ్చే ఏప్రిల్ నుంచి పనితీరు ఆధారంగానూ స్టాక్స్‌ను అందుకోనున్నారు పరాగ్ అగర్వాల్‌. అగ్రశ్రేణి గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు సారధ్యం వహిస్తున్న భారతీయుల క్లబ్‌లో పరాగ్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్‌, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ తదితర భారతీయ సీఈవోల క్లబ్‌లో పరాగ్ అగర్వాల్ చేరడం భారతీయులందరికీ గర్వకారణం. 2011లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ట్విట్టర్‌లో అడుగు పెట్టిన పరాగ్ అగర్వాల్ 2017 అక్టోబర్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా నియమితులయ్యారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org