బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ తక్కువ ధరకే ప్లాన్స్ ను అఫర్ చేస్తోంది. ప్రైవేట్ యాజమాన్య టెలికం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచేశాయి. ఈ పెరిగిన ధరలు ఎన్ని రోజులు నిలకడగా కొనసాగుతాయో చూడాలి. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో మరియు వోడాఫోన్ ఐడియా(Vi) మూడు టెలికం సంస్థలు కూడా దాదాపుగా ఒకే రకమైన ధరలతో తమ రీఛార్జ్ ప్లాన్ లను అఫర్ చేస్తున్నాయి. ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా(Vi) కొత్త టారిఫ్ రేట్లను అమలుచేయగా, రిలయన్స్ జియో మాత్రమే రేపటి నుండి కొత్త ధరలను అమలులోకి తీసుకువస్తుంది. అయితే, కొత్తగా BSNL కూడా కొత్త విషయాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ బిఎస్ఎన్ఎల్ కొనసాగించిన లైఫ్ టైం ప్రీపెయిడ్ ప్లాన్ ను నేటితో నుండి నిలిపివేస్తోంది. అయితే, బిఎస్ఎన్ఎల్ 4G లాంచింగ్ ప్రస్తుతం పరిస్థితులను చేజిక్కుంచునే అవకాశాలు ఉన్నాయి.
0 Comments