మూడు యూట్యూబ్‌ చానళ్లపై పరువు నష్టం దావా

 

తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్‌ ఛానల్స్‌పై బుధవారం కూకట్‌పల్లి కోర్టులో పరువు సమంత నష్టం దావా పిటిషన్‌ దాఖలు చేశారు. మూడు యుట్యూబ్‌ చానల్స్‌తో పాటు ఓ అడ్వకేట్‌పై కూడా సమంత కోర్టులో పిల్ దాఖలు చేశారు. తన వ్యక్తి గత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటి వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లుతోందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక సమంత పిటిషన్‌పై నేడు కూకట్‌పల్లి కోర్టులో విచారణ జరుగనుంది. సమంత తరుపున హైకోర్టు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించను న్నారు. ఇటీవల సమంత, నాగ చైతన్యతో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సామ్‌, చై నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సమంత తన విడాకుల విషయం ప్రకటించినప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, రూమర్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో తన పరువు ప్రతిష్టలను నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించిన మూడు యూట్యూబ్‌ చానల్స్‌పై సమంత కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org