మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అస్వస్థత

 

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. జ్వరం మరియు బలహీనతతో ఇబ్బంది పడుతున్న మన్మోహన్ సింగ్ ను వెంటనే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి తరలించారు. ఎయిమ్స్ డైరక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలో మన్మోహన్ సింగ్ కి ట్రీట్మెంట్ జరుగుతోంది. కాగా మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19 న కరోనా వైరస్ బారిన పడి ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్న విషయం తెలిసిందే. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే మన్మోహన్ సింగ్ కు కరోనా సోకింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org