Ad Code

అత్యంత పొడుగైన టర్కీ మహిళ

 

టర్కీ కి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ గా అవతరించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను సజీవంగా ఉన్న పొడవైన మహిళగా పేర్కొంది. రుమేసా 7.07 అడుగుల (215.16 సెం.మీ) పొడవుంది. ఆమె అసాధారణమైన పెరుగుదలకు కారణం వీవర్స్‌ సిండ్రోమ్‌ అని వైద్య నిపుణలు వెల్లడించారు. ఇది ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మతగా పేర్కొన్నారు. దీంతో ఆమె అసాధారణంగా పెరగడమే కాక చేతులు 24.5 సెంటిమీటర్లు, పాదాలు 30.5 సెం.మీ. పొడవు ఉన్నట్లు వివరించారు. దీంతో ఆమె నడవడానికి ఇబ్బంది పడటమే కాక అనేక శారీరక సమస్యలతో బాధపడుతోందన్నారు. ఈ మేరకు ఆమె ఎక్కువగా వీల్‌ చైర్‌ లేదా వాకింగ్‌ ఫ్రేమ్‌ సాయంతో నడుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. 'ప్రతి ప్రతికూలత మనకు ప్రయోజనకారే మీరు, మీ సామర్థ్యాన్ని గుర్తించండి' అంటూ ఒకరూ.. మరొకరేమో గుంపులో ఒకరుగా కాక మీకంటూ ఒక ప్రత్యేకతను కలిగిన వ్యక్తిగా ఉంటారంటూ' నెటిజన్లు రకరకాలుగా ఆమెకి ధైర్యం నూరిపోస్తు ప్రోత్సహిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu