Ad Code

ఇప్పటి వరకు అనేక విధానాల ద్వారా క్యాన్సర్‌ ట్యూమర్స్‌

ఇప్పటి వరకు అనేక విధానాల ద్వారా క్యాన్సర్‌ ట్యూమర్స్‌ చికిత్సలో చేస్తున్నారు. అయితే ఇజ్రాయిల్‌కు చెందిన కంపెనీ కొత్త తరహా విధానాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా ట్యూమర్స్‌ను మరింత ఖచ్చితంగా, లోపరహింతగానూ తొలగించవచ్చునని సంస్థ తెలుపుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి క్లినికల్‌ ట్రయిల్స్‌ను కంపెనీ యూరప్‌, అమెరికాల్లో విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.
దీని గురించి దీని సృష్టికర్త ఇజ్రాయిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన యోరమ్‌ పాట్లీ మాట్లాడుతూ - ఇది సరికొత్త తరహా విధానం. దీంట్లో రోగికి ఎటువంటి హాని జరగదు. దీనిలో అతిసూక్ష్మాతి సూక్ష్మమైన విద్యుత్‌ దైన్య తరంగాలను రోగి ట్రూనర్స్‌ వద్ద వివిధస్థాయిల్లో ప్రసరింపజేయటం ద్వారా ట్యూనర్స్‌ను నిర్మూలించటం సాధ్యమౌతుందంటున్నారు. దీన్ని ఎలక్ట్రికల్‌ ఫీల్డ్‌ థెరఫీగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ విధానంలో ఫలితాలు బావున్నాయని యూనివర్శిటీ ఆఫ్‌ ఇల్లోన్సిస్‌ చికాగో వారు సైతం ధృవీకరించారు.
గతంలో బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నటువంటి రోగికి చెమోధ్రోగ్రఫీ, రేడియోషన్‌ థెరఫీ, సర్జరీల ద్వారా విజయవంతం అయిన వారి సంఖ్య కంటే, ఈ ఎలక్ట్రికల్‌ ఫీల్డ్‌ థెరఫీ చికిత్స చేయించుకున్న వారు త్వరగా కోలుకున్నట్లు వెల్లడైంది.

Post a Comment

0 Comments

Close Menu