పరమ చెత్త వెబ్ సైట్లు

ప్రపంచంలో పరమ చెత్త సైట్ల ఎంపిక కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో అయిదింటిని పరమ చెత్త వెబ్‌సైట్లుగా నిర్థారించారు. వాటిలో ప్రధమస్థానంలో ఇహార్మనీ.కామ్‌ eHarmony.com నిలిచింది. తర్వాత స్థానంలో (Evite.com) నిలచింది. మూడోస్థానంలో (Meez.com), నాలుగో స్థానంలో ((MySpace.com), ఐదో స్థానంలో (SecondLife.com) నిలిచాయి. ఇలా పరమ చెత్త సైట్ల ఎంపిక గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఇలా సర్వే నిర్వహించటంపై ఆయా కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. ఏదైనా లోపాలు ఉంటే, వినియోగదారులు నేరుగా తమకు వెల్లడించటం సబబుగా ఉంటుందని అవి చెబుతుండగా, ప్రత్యర్థి కంపెనీలకు మాత్రం మహదానందంగా ఉంది.

No comments

Telugu Unicode Converter Online

click here http://kolichala.com/font2unicode/Encoder/unicode2font.php

Powered by Blogger.