చెన్నైలో రెండో ఎయిర్ పోర్ట్ : రెండు స్థలాలను పరిశీలిస్తున్న తమిళనాడు ప్రభుత్వం

మిళనాడు రాజధాని చెన్నైలో రెండో ఎయిర్ పోర్ట్ కోసం విజయ్ సర్కార్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గత డీఎంకే సర్కార్ మొదలుపెట్టిన పరందూర్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టును రైతుల అభ్యంతరాల్ని సాకుగా చూపుతూ రద్దు చేసిన విజయ్ ప్రభుత్వం ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మరో రెండు స్ధలాల్ని పరిశీలిస్తోంది. వీటిలో ఒక దాన్ని త్వరలో ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నై చుట్టుపక్కల ఏర్పాటు చేసే రెండో ఎయిర్ పోర్ట్ కోసం విజయ్ ప్రభుత్వం గుమ్మిడిపూండి/మనేలూరు , చెయ్యూర్‌లను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేవలం వారం రోజుల్లోనే ఈ రెండు ప్రదేశాలను గుర్తించినట్లు తెలిపాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రతిపాదిత ఎయిర్ పోర్ట్ చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా (CMA)కు సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎంపిక చేసిన రెండు స్ధలాల్లో మనేలూరు చెన్నైకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చెయ్యూర్ దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో 2022లో చెన్నై సమీపంలోని పరందూర్ లో రూ.27, 400 కోట్లతో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అప్పటి డీఎంకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రైతుల నుంచి పొలాలు, ఇళ్లు, జలవనరుల్ని సేకరించాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై రైతులు, ఇతర వర్గాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అయినా డీఎంకే సర్కార్ వెనక్కి తగ్గలేదు. దీంతో రైతులు పోరాటాలు చేయడంతో కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్ని తాజాగా విజయ్ సర్కార్ వెనక్కి తీసుకుంది. అంతే కాదు పరందూర్ నుంచి ఎయిర్ పోర్టును మరో చోటికి తరలించాలని నిర్ణయించింది. ఇప్పుడు విజయ్ సర్కార్ ప్రతిపాదిస్తున్న రెండు స్ధలాల్లో ఒక దాన్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆమోదిస్తుంది. అనంతరం పనులు మొదలు కానున్నాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org