నేపాల్‌లో వరద బీభత్సం : సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
నేపాల్‌లోని రసువా జిల్లాలో బుధవారంనాడు సంభవించిన వరదలో రసువాగఢీ, చిలిమే సహా అనేక హైడ్రోపవర్ ప్రాజెక్టులు నామరూపాలు లేకుండా పోయాయి. నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థ ప్రకారం, రసువా, దాని పరిసర ప్రాంతాల్లో సుమారు 13 నుంచి 14 హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులు వరద కారణంగా దెబ్బతిన్నాయి. దీంతో మొత్తం 748 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం పడింది. ఈ విపత్తుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో అకస్మాత్తుగా వచ్చిన నీటి ప్రవాహం నుంచి తప్పించుకోవడానికి ప్రజలు పరుగులు తీస్తున్నట్లు కనిపించారు.