పప్పుయాదవ్‌ మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉండగా చెప్పు విసిరిన దుండగుడు : అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఢిల్లీలో పప్పుయాదవ్‌ తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉండగా ఓ వ్యక్తి చెప్పు విసిరారు. అనంతరం ఎంపీపై దాడికి యత్నించగా మద్ధతుదారులు అతనిని పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అయోధ్య రామమందిర హుండీ చోరి విషయంలో ఇటీవల ప్రతిపక్షాలు పార్లమెంటు ఎదుట నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా పప్పుయాదవ్ సన్యాసి వేశం వేసి హూండీ పట్టుకొని నాటకం వేశారు. కాగా ఈ నాటకం హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఉందంటూ వారణాసిలోని కొందరు సన్యాసులు, లాయర్లు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఆ నేపథ్యంలోనే లక్నోలోని ఓ హిందూ నాయకుడు పప్పూయాదవ్‌ తల తెచ్చిన వారికి రూ. 51 లక్షల రివార్డును ఇస్తానని ప్రకటించారు. ఇంతలోనే ఈ రోజు ఆయనపై దాడి జరిగింది. దాడి అనంతరం పప్పు యాదవ్ మాట్లాడుతూ "కొంతమంది బాబాలు ప్రతిరోజూ, "నన్ను చంపండి, కాల్చండి, నేను మీకు రూ. 51 లక్షలు ఇస్తాను. అంటున్నారు. అసలు నాతప్పేమిటి ఈ దాడి మీ కళ్ల ముందే జరిగింది. అసలు నేరం బ్రిజ్‌భూషణ్ తివారీ, చంపత్ రాయ్‌లది" అని అన్నారు. పోలీసులు అతి కష్టంమీద దాడి చేసిన వ్యక్తిని అక్కడి నుండి తరలించారు. కాగా నిందితుడు తనపై దాడికి కత్తి తీసుకవచ్చాడని పప్పూ యాదవ్ తెలిపారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org