నిమ్స్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి : నిందితుడి వివరాలను సేకరించే పనిలో పోలీసులు

హైదరాబాద్ లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో  రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం వచ్చిన యువతిపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో యువతికి రెండు కాళ్లు విరగడంతో ఆమెను కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో పక్క బెడ్‌లో ఉన్న మరో రోగి అటెండెంట్ యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వ్యక్తి ప్రవర్తనతో యువతి తీవ్ర భయాందోళనకు గురైంది. వెంటనే జరిగిన విషయాన్ని యువతి మరుసటి రోజు తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ విషయంపై యువతి తండ్రి, ఆర్‌ఎంపీ వైద్యుడు.. పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రి, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org