'సప్తధార' విజన్‌ను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ
మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ : ప్రాసెస్డ్ భాగాల నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తుల వరకు మొత్తం సప్లై చైన్ భారత్ చేతుల్లోనే ఉండాలి. డిజైన్ నుంచి తయారీ వరకు ప్రపంచ గ్లోబల్ సప్లై చైన్‌కు భారత్ ఒక ప్రధాన కేంద్రంగా మారాలి.
వ్యవసాయం & ఆహార శుద్ధి : వ్యవసాయ రంగంలో విస్తృతమైన 'ఫుడ్ ప్రాసెసింగ్' విధానాలను తీసుకురావాలి. భారతీయ రైతుల ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ తలుపులు తట్టేలా చర్యలు చేపట్టాలి.
సాంకేతికత & ఆవిష్కరణలు : భారత్ సాంకేతికతకు కేవలం మార్కెట్‌గానే కాకుండా, గ్లోబల్ హబ్‌గా ఎదగాలి. AI, క్వాంటం టెక్నాలజీ, స్పేస్, రోబోటిక్స్, డేటా సెంటర్లు మరియు UPI వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రపంచాన్ని శాసించాలి.
గతిశక్తి (కనెక్టివిటీ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) : దేశమంతటా అతుకులు లేని రవాణా సదుపాయాలు ఉండాలి. హైస్పీడ్ రైళ్లు, ఆధునిక ఎక్స్‌ప్రెస్ హైవేలతో నగరాలను అనుసంధానించాలి.
రక్షణ రంగంలో ఆత్మనిర్భరత : రక్షణ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, గ్లోబల్ సప్లయర్‌గా మారాలి. డ్రోన్ సిస్టమ్స్, హైపర్ సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీలో భారత్ నాయకత్వం వహించాలి.
గ్రీన్ & బ్లూ ఎకానమీ : గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం ద్వారా 'గ్రీన్ జాబ్స్' సృష్టించాలి. అలాగే, సుదీర్ఘ సముద్ర తీరప్రాంతాన్ని వాడుకుంటూ చేపల పెంపకం, కోస్టల్ టూరిజమ్, ఓషన్ టెక్నాలజీతో 'బ్లూ ఎకానమీ'ని బలోపేతం చేయాలి.
ఇండియాస్ సాఫ్ట్ పవర్ (భారత సాంస్కృతిక బలం) : యోగా, ఆయుర్వేదం, విశ్వాస కేంద్రాలు, సాంప్రదాయ వైద్యం ద్వారా ప్రపంచస్థాయిలో భారత్‌పై నమ్మకాన్ని పెంచాలి. యోగా ఇప్పటికే భారత్‌ను ప్రపంచంతో అనుసంధానించే శక్తిగా మారింది.