ఆగస్టు 12న గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ విడుదల
గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ ను రివీల్ చేసే కొత్త టీజర్ ను గూగుల్ రిలీజ్ చేసింది. ఇంకా కేవలం రెండు రోజుల్లో ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబడుతుంది. గూగుల్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ కోసం డేట్ అండ్ టైం ఫిక్స్ చేసింది. ఈ సిరీస్ భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12వ తేదీ ఉదయం 3 గంటల 30 నిమిషాలకు లాంచ్ అవుతుంది. అంతేకాదు, అదే రోజు నుంచి ఈ సిరీస్ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్ కూడా ప్రారంభం అవుతుంది. గూగుల్ స్టోర్ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి కొత్త టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ లో గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ డిజైన్ ని రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ టీజర్ ప్రకారం, ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్ బెజెల్స్ మరియు స్ట్రాంగ్ హింజ్ కలిగి ఉంటుంది. ఇది బుక్ స్టైల్ ఫోల్డబుల్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో బ్రైట్ అండ్ బిగ్ డిస్ప్లే, స్పీకర్ గ్రిల్ మరియు 3.5mm జాక్ పోర్ట్ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ పై మార్కెట్ వర్గాల అంచనా స్పెక్స్ మరియు లీక్స్ మాత్రం ఈ ఫోన్ గురించి ఒక అవగాహన ఇస్తున్నాయి. ఈ ఫారిన్ లీక్స్ మరియు మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఫోన్ స్పెక్స్ అంచనా వేశారు. వీటి ప్రకారం, ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 8 ఇంచ్ M16 OLED స్క్రీన్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో సరికొత్త గూగుల్ Tensor G6 చిప్ సెట్ ఉండొచ్చని కూడా లీక్స్ ఉన్నాయి. ఆలాగే, ఈ ఫోన్ లో 12GB నుంచి 16GB వరకు ర్యామ్ మరియు 256GB / 512GB / 1TB స్టోరేజ్ ఆప్షన్ ఉండే అవకాశం ఉండవచ్చు. ఇందులో ట్రిపుల్ మెయిన్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ గురించి కూడా అంచనా వేసి చెబుతున్నారు.