మధ్యప్రదేశ్‌లో అకృత్యం : మహిళను వివస్త్రను చేసి, చెప్పుల దండ వేసి, వీధుల్లో ఊరేగించిన దుర్మార్గులు

ధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా హర్నియా కేడి గ్రామంలో ఒక మహిళపై అత్యంత పాశవిక దాడి జరిగింది. తన కుటుంబ సభ్యులే ఆమెపై దాడి చేసి, దుస్తులు చింపి, ముఖానికి మసి పూసి, చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. 30 ఏళ్ల బాధిత మహిళ తన భర్తకు, కుటుంబానికి దూరంగా ఉంటోంది. ఆస్తి వివాదం కారణంగా తన అత్తారింటికి వెళ్లి హక్కు అడగగా, భర్త తండ్రి, బంధువులు కలిసి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారు. ఆమె జుట్టును కత్తిరించి, అందరూ చూస్తుండగానే గ్రామంలో అవమానపరుస్తూ హింసించారు. ఈ ఘటనపై పోలీసులు మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు గ్రామ మాజీ వాచ్‌మెన్‌తో పాటు, ఈ దారుణాన్ని వీడియో తీసిన వ్యక్తి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి అవసరమైన న్యాయ సహాయం మరియు పునరావాస చర్యలను జిల్లా యంత్రాంగం అందిస్తోంది. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org