రూ. 610 వద్ద లిస్ట్ అయిన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్లు : 13 మంది ఉద్యోగులు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిన వైనం

స్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ స్టాక్ మార్కెట్లలో విజయవంతంగా లిస్ట్ కావడంతో సంస్థ ఉద్యోగులపై కాసుల వర్షం కురిసింది. కంపెనీ గతంలో అందించిన ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్  ద్వారా సంస్థలోని 13 మంది ఉద్యోగులు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారారు. ఈ 13 మంది వద్ద ఒక్కొక్కరికి రూ. 1 కోటికి పైగా విలువైన విక్రయించదగిన 'వెస్టెడ్ ఈక్విటీ షేర్లు' ఉన్నాయి. మంగళవారం స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయిన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్లు విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లే మంచి లిస్టింగ్ లాభాలను అందించాయి. ఇష్యూ ధర రూ. 574 పై 6.27% ప్రీమియంతో రూ. 610 వద్ద లిస్ట్ అయింది. దాదాపు 7% లిస్టింగ్ గెయిన్స్‌తో రూ. 613.30 వద్ద లాభాల్లో అడుగుపెట్టింది. దేవిందర్ పాల్ సింగ్ (డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్) అత్యధికంగా లబ్ధి పొందారు. ఈయన వద్ద 21.14 లక్షల వెస్టెడ్ షేర్లు ఉండగా, ఐపీఓ ఇష్యూ ప్రైస్ ప్రకారం వీటి విలువ రూ. 121 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా మరో రూ. 30 కోట్ల విలువైన అన్-వెస్టెడ్ షేర్లు ఉన్నాయి. శ్రీనివాసన్ రామ అయ్యర్ (చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్)  వద్ద 18.25 లక్షల వెస్టెడ్ షేర్లు ఉండగా వీటి విలువ రూ. 105 కోట్లు. భవిష్యత్తులో పొందే అవకాశం ఉన్న అన్-వెస్టెడ్ షేర్ల విలువ మరో రూ. 51 కోట్లు. శ్రీనివాస్ జైన్ (సిడిఓ & ఇన్వెస్టర్ రిలేషన్స్ హెడ్) వద్ద రూ. 59 కోట్ల విలువైన వెస్టెడ్ షేర్లు వున్నాయి. రాజీవ్ రాధాకృష్ణన్ (సిఐఓ - ఫిక్స్డ్ ఇన్కమ్) వద్ద  దాదాపు రూ. 36 కోట్ల విలువైన వెస్టెడ్ షేర్లు ఉన్నాయి. అపర్ణ నిర్గుడే (చీఫ్ రిస్క్ ఆఫీసర్) వద్ద రూ. 31 కోట్ల విలువైన షేర్లు వున్నాయి. వినయ దాతర్ (చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్) వద్ద దాదాపు రూ. 21 కోట్ల విలువైన వెస్టెడ్ షేర్లు వున్నాయి. దీంతో పాటు సీఎఫ్ఓ ఇందర్‌జీత్ ఘులియాని, సీహెచ్‌ఆర్‌ఓ రజత్ గ్రోవర్, సీఐఎస్‌ఓ సంజయ్ పుగావ్‌కర్, ఫండ్ మేనేజర్లు మోహన్ లాల్, మహేష్ ఛాబ్రియాలతో పాటు ఇతర ఉద్యోగుల షేర్ల విలువ కూడా కోటికి పైగా పెరిగింది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ 2018లో మొదటిసారిగా ఉద్యోగులకు రూ. 39 నుండి రూ. 455 మధ్య ఎక్సర్‌సైజ్ ప్రైస్‌తో ఈఎస్‌ఓపీ కేటాయించింది. ఐపీఓ ధరను రూ. 574గా నిర్ణయించడంతో ఉద్యోగులు భారీగా లాభపడ్డారు. ఐపీఓకి ముందే సంస్థ బ్లాక్‌రాక్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి 129 ప్రముఖ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,663 కోట్లు సేకరించడం విశేషం.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org