రెండో రోజు కూడా 16 మెట్రో స్టేషన్లను మూసివేత : జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు
కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వరుసగా రెండో రోజు కూడా నగరంలోని 16 కీలక మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీంతో సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మెట్రో స్టేషన్ల మూసివేత వల్ల న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమయానికి న్యాయస్థానానికి చేరుకోలేకపోతున్నారని తెలుపుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఈ అంశంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరింది. ఈ పిటిషన్‌పై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం వరకు వేచి చూద్దామని, ఆ తర్వాత కూడా రవాణా సమస్యలు పరిష్కారం కాకపోతే, సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేస్తుందని స్పష్టం చేశారు.