ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రధానోపాధ్యాయుడు
తెలంగాణ లోని మహబూబాబాద్ జిల్లాలో గూడూరు మండలం అయోధ్యపురంలో పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇన్చార్జ్ ఎంఈఓగా వ్యవహరిస్తున్న రవికుమార్ టీచర్ ఫైల్ క్లియర్ చేయడం కోసం డబ్బులు డిమాండ్ చేశారు. రూ.15000 లంచమిస్తూ ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు హెడ్మాస్టర్ ను పట్టుకున్నారు. రిటైర్డ్ కాబోయే ఉపాధ్యాయుడి నుంచి ముడుపులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు హెడ్మాస్టర్ పట్టుబడడంతో కలకలం రేపింది. విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.